విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా అంజలి , సమంత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్వహించాడు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసిన సినిమా కావడంతో ఆ సమయంలో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ సినిమా తాజాగా రీ రిలీజ్ కావడంతో ఈ మూవీ లో ఓ చిన్న సన్నివేశంలో ఉన్న ఓ నటి గురించి చాలా మంది జనాలు చర్చిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో బ్యాక్గ్రౌండ్ లో ఓ ముద్దు గుమ్మ ఉంది. 

బ్యాక్ గ్రౌండ్ లో అప్పుడు ఎవరూ పట్టించుకోని ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇంతకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బ్యాక్ గ్రౌండ్లో కనిపించిన ఆ నటి ఎవరో కాదు ... ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తున్న దక్షా నగర్కర్. ఇప్పటికే ఈ బ్యూటీ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో చాలా తెలుగు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: