రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంతో వివాదాస్పదం కాగా ట్రోల్స్ వల్ల చివరకు బిజినెస్ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలేఖ్య ప్రస్తుతం యూట్యూబ్ కు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే అలేఖ్య చెల్లి రమ్యకు ఇన్ స్టాగ్రామ్ భారీ షాకివ్వడం గమనార్హం.
 
7 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆమె యూట్యూబ్ అకౌంట్ డిసేబుల్ అయింది. ఈ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిసేబుల్ కావడానికి కారణాలు తనకు కూడా తెలియదని ఆమె చెబుతున్నారు. మొదట రమ్య గోపాల్ కంచర్లకు సంబంధించిన రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు డిసేబుల్ కాగా అప్పీల్ చేయడంతో ఒక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఆమె తిరిగి పొందారు. అయితే తిరిగి పొందిన అకౌంట్ లో కేవలం 3.5 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని ఆమె చెబుతున్నారు.
 
యూట్యూబ్ వీడియో ద్వారా తన ఫాలోవర్లు కొత్త పేజీని ఫాలో కావాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ అక్కా చెల్లెళ్ల టైమ్ అసలు బాలేదని అందుకే ఒక షాక్ తర్వాత మరో షాక్ తగులుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్కా చెల్లెళ్లను ఎవరైనా టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. రమ్య గోపాల్ కంచర్ల సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
 
వచ్చినవాడు గౌతమ్ అనే సినిమాతో రమ్య గోపాల్ కెరీర్ మొదలుకానుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రమ్య కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. అయితే తనకు చెడు జరుగుతున్నా భవిష్యత్తులో మంచి జరుగుతుందంటూ రమ్య గోపాల్ కామెంట్లు చేశారు. రమ్య గోపాల్ కంచర్ల  భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: