స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయనకు విషెస్ అందిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అభిమానులు . మరీ ముఖ్యంగా ఆయన లేని లోటు గుర్తు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు అయితే సీనియర్ ఎన్టీ రామారావు గారి కి తమతో ఉన్న అనుబంధం గురించి రకరకాల ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు . కాగా ఇదే మూమెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు డ్రైవర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తాలూకా వీడియో బాగా వైరల్ గా మారింది . అంతేకాదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన లక్ష్మీపార్వతిని ఆయన కొట్టారు అన్న విషయాన్ని ఓపెన్ గానే ఆ వీడియోలో ఆయన బయటపెట్టారు .


దానికి కారణం ఆమె చేసిన పనే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఆయన కొడుకు హరికృష్ణ కూతురు పెళ్లి సమయంలో ఆమె  నందమూరి తారక రామారావు గారిని అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకునింది అని .. ఆ కారణంగానే సీనియర్ ఎన్టీఆర్ కి కోపం వచ్చి ఆమెని కుర్చీలో అడ్డంగా కూర్చుని ఉంటే తోసేసి మరి కారు ఎక్కి వెళ్లిపోయాడు అని .. స్వయంగా ఆయన డ్రైవర్ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. హరికృష్ణ ఇంటికి వచ్చి మరీ పదే పదే తన కూతురు పెళ్లికి రావాలి అని చెప్పారు అని.. ఏడు గంటల తర్వాత వచ్చి అక్షింతలు  వేయండి అంటూ కూడా చెప్పారు అని.. అయితే 6:30 నుంచి ఆయన రూమ్ బయట ఆమె  కాపలాగా కూర్చుంది అని ..



కానీ ఎన్టీఆర్ గారు మాత్రం అవేవీ పట్టించుకోకుండా హరికృష్ణ కూతురు పెళ్ళికి వెళ్లడానికి సిద్ధమయ్యారు అని డ్రైవర్ చెప్పుకొచ్చారు.  చివరి నిమిషంలో అడ్డుకోవాలని చూసిన లక్ష్మీపార్వతిని కుర్చీలో కూర్చొని ఉంటే తోసేసి మరి కారు ఎక్కి పెళ్లికి వెళ్లారు అని ..అక్కడ తన మనవరాలు.. మనవళ్లు.. కూతుర్లు.. కొడుకులు .. అల్లుళ్ళు.. కోడళ్ళు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చేశారని . దెబ్బకి ఆయన కోపం మొత్తం మాయమైపోయింది అని . పెళ్లిని చక్కగా ఎంజాయ్ చేశారు అని భోజనం కూడా చేశారు అని.. ఆ తర్వాత మళ్లీ ఎంతో ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు అని స్వయంగా డ్రైవర్ చెప్పిన మాటల తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  దీన్నిబట్టి సీనియర్ ఎన్టీ రామారావు గారికి లక్ష్మి పార్వతికి మధ్య కూడా గొడవలు ఉన్నాయి అని అర్ధమైపోతుంది. పరోక్షంగా ఆయన మరణానికి కారణం లక్ష్మీపార్వతి కూడా అయి ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారు నందమూరి అభిమానులు.  సోషల్ మీడియాలో మరోసారి లక్ష్మీపార్వతిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నందమూరి అభిమానులు..!



మరింత సమాచారం తెలుసుకోండి: