సూపర్ స్టార్ మహేష్ బాబు మంచితనం గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. ప్రిన్స్ అందం గురించి ఎంత పొగిడిన అతిశయుక్తి కాదు. మహేష్ బాబు ఎంత అందంగా ఉంటారో.. ఆయన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
 
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా కూడా రీరిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా అంటే చాలు నెటిజన్స్ పడి చచ్చిపోతారు. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించారు. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరపైకి తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఎప్పటినుండో ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొదటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కొట్టలేకపోయినా.. ఈసారి మాత్రం మంచి కలెక్షన్స్ ని సంపాదిస్తుంది.  

 
ఇక ఖలేజా మూవీ రీరిలీజ్ అవ్వడంతో అభిమనులు వింత వింత పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫ్యాన్ గర్ల్స్ సినిమాలోని పిలిచే పెదవులపైన పాటకు థియేటర్ లో డ్యాన్స్ చేస్తూ ఓ ఊపు ఊపేశారు. సినిమాలో మహేష్ బాబుని దేవుడు అంటూ అందరూ దండం పెట్టె ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ని కూడా అభిమానులు రీ క్రియేట్ చేసేశారు. మరో వీరాభిమాని థియేటర్ లో ఖలేజా హాస్పిటల్ సీన్ ని సైతం రీక్రియేట్ చేశారు. అతను పేషంట్ గౌన్ ధరించి, చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకొని మరో చేతిలో ఒక మొక్కను పట్టుకొని వచ్చారు. ఖలేజా మూవీలో మహేష్ బాబు చిచూ అని ఓ పిల్లాడికి పేరు పెట్టె కామెడీ సీన్ కూడా థియేటర్ లో మహేష్ బాబు అభిమానులు దింపేశారు. ఇవన్నీ ఒకెత్తు అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా కోసం వింత పనులు చేస్తున్నట్టు తెలిసింది. ఖలేజా సినిమా ఇంట్రడక్షన్ లో మహేష్ బాబు పామును పట్టుకొని ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ రిక్రియేట్ చేయడం కోసం మహేష్ బాబు అభిమానులు పాములను పట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే పాములను థియేటర్ లోకి తీసుకువచ్చిన వీడియోలేవీ బయటకు రాలేవు. ముందు ముందు మరి ఇంకెన్ని వీడియోలు చూడాల్సి వస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: