
పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఈమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. రెట్రోతో పాటుగా ఈమె కూలీ, కాంచన 4 సినిమాలలో కూడా నటిస్తోంది. ఇటీవలే పూజా రెట్రో మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో హీరోగా తమిళ నటుడు సూర్య నటించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా విడుదలయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. అందులో ఈ బుట్టబొమ్మ ఓ రెస్టారెంట్ లో తన పెట్ డాగ్ తో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ పెట్ డాక్ పై ప్రేమను చూపిస్తూ సంబరపడిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఈ ప్రేమను అంతా పెళ్లయ్యాక మీ వాడిపై చూపించుకో అమ్మ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.