
దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతూ శోభాశెట్టికి ఏమైంది? ఎందుకు సోషల్ మీడియాకు గుడ్ బాయ్ చెబుతోంది అంటూ అభిమానులు నెటిజెన్స్ పలు రకాలుగా ఆమె సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేసే శోభాశెట్టి సడన్గా బ్రేక్ తీసుకుంటుంది అంటూ అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు. శోభ శెట్టి నటుడు యశ్వంత్ ని ప్రేమించి వివాహం చేసుకోబోతోంది. ఇటీవలే వీరికి సంబంధించి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారట.
కానీ శోభా శెట్టి వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదని అయితే వచ్చిన కార్తీకదీపం 2 సీరియల్ అవకాశం కూడా చేజారిపోయిందని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చి గార్మెంట్ బిజినెస్ మొదలుపెట్టిన సాఫీగా జరగడంలేదని టాక్ వినిపిస్తోంది.. ఇలా శోభా శెట్టి అనుకున్నవన్నీ జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందంటూ ప్రచారం జరుగుతున్నది.. అందుకే సోషల్ మీడియాకు కొంత మేరకు గ్యాప్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.