మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా చిత్రం కన్నప్ప.. ఈ చిత్రం మరో రెండు వారాలలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న తరుణంలో ఇప్పటికే మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ ని వేగవంతంగా చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో వస్తున్న కన్నప్ప చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర సెలబ్రిటీలు నటించారు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కాబోతోంది.

అయితే ఈ చిత్రానికి మంచు విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది. కన్నప్ప సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని విధంగా ప్లాన్ చేస్తున్నారు మంచు విష్ణు. అక్షయ్ కుమార్ కూడా ముంబై ప్రెస్ మీట్ లో రెండు మూడు సార్లు కనిపించారు. ఇటీవలే గుంటూరులో జరిగిన కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఉన్నారని తెలిసి ఫోకస్ మొత్తం అభిమానులు చేస్తున్నారు.

కానీ ఇప్పటివరకు కన్నప్ప చిత్రానికి సంబంధించి ప్రభాస్ ప్రమోషన్స్ లో ఎక్కడ కనిపించలేదు..సినిమా విడుదల కేవలం 17 రోజులు మాత్రమే ఉన్నది. మరి కన్నప్ప సినిమాకి హైప్ పెరగాలంటే ప్రభాస్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయిస్తే కచ్చితంగా మంచు విష్ణు సినిమాకి ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. కన్నప్ప చిత్రంలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. మరి మంచు విష్ణు ప్రభాస్ ని ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటారా లేదా అన్న విషయం చూడాలి.. కచ్చితంగా హైప్ పెరగాలి అంటే ప్రభాస్ తో ఈ పని చేయించాల్సిందే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: