దగ్గుబాటి అభిమానులు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న సీజన్ రామానాయుడు 2 ఎట్టకేలకు నిన్నటి రోజున ఓటీటీలో స్ట్రిమింగ్ అయ్యింది. హీరో వెంకటేష్ , రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఉన్నది. అన్ని భాషలలో స్ట్రిమింగ్ అవుతోంది. గతంలో విడుదలైన రామానాయుడు మొదటి సీజన్ల కొన్ని అసభ్యకరమైన పదజాలాలు ఉండటం వల్ల చాలా విమర్శలు కూడా వినిపించాయి. ఆ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగానే రెండవ సీజన్ వచ్చింది మరి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

స్టోరీ లోకి వెళితే మొదటి సీజన్లో బాలీవుడ్ లో ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే వ్యక్తిగా రామానాయుడు (రానా) . తన భార్య ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. అయితే అలాంటి సమయంలోనే రానాకు అస్సలు పడని తన తండ్రి నాగానాయుడు (వెంకటేష్) జైలు నుంచి విముక్తి పొందుతాడు. నాగ నాయుడు కి మరో ఇద్దరు కొడుకులు కూడా ఉంటారు. అందులో ఒకరు  తేజ్ నాయుడు(సుశాంత్ సింగ్), మరొకరు జఫ్ఫా నాయుడు (అభిషేక్ బెనర్జీ).. నా వీరందరి మధ్య కూడా రానా సతమతమవుతూ ఉంటారు.


రెండవ సీజన్లో విషయానికి వస్తే.. రానా తన కుటుంబం భవిష్యత్తు కోసం ఒక పెద్ద రిస్క్ ఆపరేషన్ చేయాలనుకుంటారు.. అని కొత్త శత్రువు రావుఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) తన పాత గొడవలను తిరిగి మరి తీసుకువస్తూ నాగ, రానా, సోదరులతో పాటుగా భార్య పిల్లల మధ్య సంఘర్షణలు మరింత తీవ్రవం అయ్యేలా చేస్తారు. రామానాయుడు కొడుకు కిడ్నాప్ తో స్టోరీ మరింత కీలకంగా మారుతుంది. చివరికి రానా, నాగ ఇద్దరు కూడా ఒక్కటై తమ కొడుకుని రక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఆ తర్వాత తన శత్రువు సైఫ్ ను రానా పూర్తిగా అంతమందిస్తారు కానీ.. సైఫ్ సోదరుడు రావూఫ్, రానా పైన పగ తీర్చుకోవాలని  చూస్తూ ఉంటాడు  ఆ క్రమంలోనే రానా ఒక చివరి మిషన్ లో పాల్గొని ఏం చేస్తారు?. రానా, నాగ కలిసి తమ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారు?.. రానాకు వెన్నుపోటు పొడిచేది ఎవరు అనేది తెలియాలంటే తెరమీద చూడాలి.


మొదటి సీజన్లో అశ్లీలత హింస ఎక్కువగా ఉండడంతో విమర్శలు వినిపించాయి.. అయితే సీజన్ 2 లో అలాంటి సన్నివేశాలు అనవసరపు హింస లేదు. సీజన్ వన్ ఉన్నట్లుగా సీజన్ 2 లేదని విధంగా తెలియజేస్తున్నారు. సీజన్ 2 సాధారణ యాక్షన్ థ్రిల్లర్ గా మారిపోయిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా కథలో స్థిరత్వం లేదు , ట్విస్టులు లేవు, ఎమోషన్స్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. 8 ఎపిసోడ్ లలో చాలా డ్రాగ అనిపించిందని తెలుపుతున్నారు ఆడియన్స్.


హీరో వెంకటేష్ నాగ నాయుడు గా బాగానే ఆకట్టుకున్నారు. కృతికర్బంద, సుర్విన్ చావ్లా, అతిధి శెట్టి వంటి వారికి ఎక్కువగా సీజన్ 2లో ప్రాధాన్యత ఇవ్వడం ప్లస్ గా మారింది. అర్జున్ రాంపాల్, రావూఫ్ మీర్జా విలన్ గా ఆకట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.


ప్లస్ పాయింట్స్:
నటీనటులు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్:
కథ, రానా పాత్ర, ఎడిటింగ్, ఎపిసోడ్ లాంగ్ లెన్త్.


క్యారెక్టర్లు బాగున్నప్పటికీ కథ దెబ్బేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: