
ఆమె మోస్ట్ హంటెడ్ ప్లేస్ అని చెప్పడం మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు జనాలు. అయితే కేవలం కాజోలు మాత్రమే కాదు గతంలో ఇవే మాటలను చాలామంది సెలబ్రిటీలు చెప్పారు. మరి ముఖ్యంగా హీరోయిన్ తాప్సి , డైరెక్టర్ రవిబాబు కూడా ఇలాంటి అనుభవాలనే ఫేస్ చేసినట్లు గతంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు .
"చంద్రముఖి 2 టైంలో ఓ ఘటన జరిగిందట. తన ఫిమేల్ సింగర్ ల బృందానికి ఇలాగే ఓ ఘటన ఎదురైందట . రామోజీ ఫిలిం సిటీ లోని సింఫనీ రూమ్లో ఫిమేల్ సింగర్లు అందరూ పాటలు పాడుతున్నారట . అయితే ఆ టైంలో వాళ్లకి చెవిలో ఏవో వింత వింత సౌండ్స్ వినిపించాయట . ఎవరో వచ్చి తాకినట్లు .. ఎవరో పిలుస్తున్నట్లు.. ఆ సింగర్లు అంతా భయపడిపోయారట . అదే విషయం తన వద్ద చెప్పారు " అంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ నటి నుశ్రుతా కూడా ఇదే విధంగా చెప్పింది . "తాను ప్యాక్ చేసుకొని పెట్టుకున్న డ్రస్సులు అన్ని చల్ల చెదురుగా పడి ఉండేటివట . ఫుడ్ కూడా ఎవరో సగం తిని వదిలేసినట్టుగా అనిపించేదట . ఇవన్నీ విన్నాక నిజంగానే రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయా ..? అంటూ చర్చించుకుంటున్నారు జనాలు . అయితే రామోజీ ఫిలిం సిటీని సమాధుల మీదే కట్టారు అంటూ ఒక విషయం బయటకు వచ్చింది . ఎంతోమంది ముస్లిం సైనికులను పాతిపెట్టిన చోట ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉందట. అందుకే అక్కడ అద్దాలపై అప్పుడప్పుడు ఉర్దు అక్షరాలతో పదాలు కనిపిస్తూ ఉంటాయని కూడా నెట్టింట్లో తెగ ప్రచారాలు జరుగుతూ వీడియోలు వైరల్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనే విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది ..!!