తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు.అయితే ఇలాంటి ఒక సంఘటన 1993లో కూడా జరిగిందని కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందులో ఉన్న ఎంతోమంది సెలెబ్రెటీలు బతికి బయటపడ్డారని అప్పటి విషయం మళ్ళీ ఇప్పుడు వైరల్ గా మారుతున్న సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో ప్రమాదం జరిగిన ఆ విమానంలో అల్లు రామలింగయ్య, చిరంజీవి,బాలకృష్ణ, విజయశాంతి,కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి  అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి మనవరాలు ఇలా ఎంతో మంది ప్రముఖులు ఆ విమానంలో ఉన్నారు. అయితే ఈ విమాన ప్రమాదం గుండ్ల పల్లె అనే చిన్న పల్లెటూరులో జరిగింది. 

అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. విమానం పొలం గట్టుమీద ల్యాండ్ అవ్వడంతో ఆ బురద నుండి చాలామంది నడుచుకుంటూ బయటికి వచ్చారు. ఎంతోమంది ప్రాణాలతో బయటపడ్డామని ఆ ఊరి దేవతలకు మొక్కుకున్నారట. అయితే ఈ ప్లేన్ క్రాష్ ఎక్కడ జరిగిందో ఆ పల్లెటూరి వాళ్ళకి బాలకృష్ణ, చిరంజీవి ఒక మాట ఇచ్చారట. అదేంటంటే గుండ్లపల్లె పల్లెటూరు వాసులను చూసి చిరంజీవి, బాలకృష్ణ మమ్మల్ని ఈ ఊరు కాపాడింది అని వారి దగ్గర మాట్లాడుతూ మీకేం కావాలో అడగండి అని అన్నారట. దాంతో వాళ్ళందరూ మా ఊరికి ఒక ఆసుపత్రి కట్టించండి అని చెప్పారట.

అయితే ఆ రోజు చిరంజీవి బాలకృష్ణ ఆస్పత్రి కట్టిస్తాం అని అందరి ముందుమాట ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదట. అలా ఇచ్చిన మాట తప్పారంటూ తాజాగా గుండ్లపల్లె వాసులు మీడియాతో చెప్పుకున్నారు.. అలాగే ఈ విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎంతోమంది ప్రత్యక్ష సాక్ష్యులు మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు అందులో ఉన్న సెలబ్రిటీలు భయంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్నారు.వారికి మేం మజ్జిగ, నీళ్లు వంటివి ఇచ్చాము.ఏం కాదు అనే ధైర్యం చెప్పాము. ఇక విమానం ల్యాండ్ అయిన పొలం పాడైపోవడంతో నష్టపరిహారం కూడా ఇచ్చారు... ఇక విమాన ప్రమాదం నుండి బయటపడ్డ ఎంతోమందిని తీసుకువెళ్లడానికి కార్లు,హెలికాఫ్టర్లు వచ్చాయి.

 ఇక విమానం మా పొలాల్లో దాదాపు సంవత్సరం వరకు అలాగే ఉంది.దాంతో చాలామంది ఇరుగు పొరుగువారు ఆ విమానాన్ని చూడడానికి వచ్చారు. మాకు విమానం ఎక్కాలనే కోరిక కూడా తీరింది. ఇక విమానాన్ని చూడడానికి వచ్చిన సమయంలో పర్యాటకులు పెరగడంతో అక్కడ చిన్న చిన్న బిజినెస్ లు కూడా పెట్టుకున్నాము అంటూ గుండెపల్లెవాసులు మీడియాతో పంచుకున్నారు.ఏది ఏమైనప్పటికీ చిరంజీవి బాలకృష్ణ మాత్రం హాస్పిటల్ కట్టిస్తామని మాకు మాట ఇచ్చి మరీ తప్పారు అంటూ మీడియాతో గుండ్ల పల్లె వాసులు చెప్పుకోవడంతో ఈ విషయం బయటికి వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: