- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్‌ క్రియేట్ చేసుకున్న సినిమాలలో వార్ 2 కూడా ఒకటి. టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ... అలాగే బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా యష్‌రాజ్‌ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వార్ 2 సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జిటై గా ఎదురు చూపులు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ లో క్రేజీ సీక్వెన్స్ మరియు ముఖ్యంగా ఎన్టీఆర్ - హృతిక్ రోష‌న్ మధ్య వ‌చ్చే సన్నివేశాలు అదిరిపోయాయి. దర్శకుడు ఆయాన్ ముఖర్జీ లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు.


వార్ 2 లో తనకు బాగా ఇష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది ఇద్దరు లీడ్ హీరోస్ మధ్య ఘర్షణ సన్నివేశాలు అని తెలిపాడు. దీనిని బట్టి ఇద్దరి హీరోల మధ్య యాక్షన్ సీక్వెన్స్‌ లు క్రియేట్ చేయాల్సిన పరిస్థితిలు త‌న‌కు ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించాయని చెప్పాడు. దీంతో ఇప్పుడు అందరూ ఈ సీక్రెన్సెస్ ఎలా ఉంటాయన్న ఆసక్తితో ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక వార్ 2 సినిమాలో ఆగ‌స్టు 15 కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: