శ్రీ రెడ్డి  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమె తెలియని వారు ఉండరు.కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో ఇతర జనాలకు కూడా ఈమె పేరు బాగా పరిచయమే. ప్రస్తుతం శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీని వదిలి తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడ ఉన్నా కానీ కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని బయట పెడుతూనే ఉంటుంది. అలాంటి శ్రీరెడ్డి అప్పట్లో మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదే తరుణంలో శ్రీ రెడ్డి అప్పట్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎక్కడ చూసిన ఫోన్ టాపింగ్ విషయాలే వార్తలుగా వినిపిస్తున్నాయి. 

అంతే కాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై నటి శ్రీరెడ్డి అప్పట్లో ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రేండింగ్ లోకి వచ్చింది.. ఆమె మాట్లాడిన వీడియో ప్రకారం.. జీవన్ రెడ్డి పెద్ద ఫ్రాడ్ అని చెప్పుకొచ్చింది. నన్ను చాలా వేధించాడు.. నన్ను ఒక్కదాన్నే కాదు తన వెనుక చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలని ఎప్పుడు పార్క్ హయాత్ హోటల్ కి రమ్మని చెబుతూ ఉంటాడు.. ఓసారి ఆయన పిలిచాడని వెళ్లి కలిసా.. నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ ను సినిమాల్లో బ్లాక్ మనీ పెట్టి సపోర్ట్ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు.

 రామ్ చరణ్ ప్రభాస్ కూడా మేము చెప్పింది చేస్తూ ఉంటారని అన్నాడు. ప్రస్తుతం మేము అధికారంలో ఉన్నాం మేము ఏది చెప్తే అది చేయాలి అంటూ  మాట్లాడాడు.. ఆయన మాటలను నేను స్వీకరించాను.. నేను ఏదో ప్రతివతను అని చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు నేను కంఫర్ట్ గా లేను.. ఆ టైంలో ఆయనను నమ్మి  పడుకోలేను.. కాస్త టైం కావాలి అని అడిగాను.. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అతగాడి దగ్గరికి వెళ్లారు.. చాలామంది అమ్మాయిలను ఆయన వాడుకున్నారు అంటూ చెప్పుకొచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తోంది.. ఫోన్ టాపింగ్ విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ వీడియో బయటకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవన్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: