తమిళ నటుడు ధనుష్ తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ నిన్న అనగా జూన్ 20 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల పాటు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేసీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఇప్పటికే అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకోగా , డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలు పూర్తి అయ్యాక ఈ మూవీ స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: