తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మొదటి సినిమాతో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఈయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత నాని హీరోగా రూపొందిన దసరా మూవీ తో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక దసరా సినిమా తర్వాత కూడా శ్రీకాంత్ తన తదుపరి మూవీ ని కూడా నాని తో చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే నాని , శ్రీకాంత్ కాంబోలో ది ప్యారడైజ్ అనే సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం నాని హీరోగా హాయ్ నాన్న అనే సినిమాను శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే శౌర్యవ్ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇకపోతే శౌర్యవ్ తన తదుపరి మూవీ ని కూడా నాని తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా శౌర్యవ్ , నానికి ఓ కథను వినిపించగా అది బాగా నచ్చడంతో నాని మరోసారి శౌర్యవ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ మాదిరి గానే శౌర్యవ్ కూడా నాని సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి , ఆ తర్వాత మూవీ ని కూడా నాని తో చేయబోతున్నాడు. ఇకపోతే నాని కొంత కాలం క్రితం హిట్ ది థర్డ్ కేస్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: