తమిళ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. లోకేష్ కనకరాజ్ ఆఖరుగా తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు.

లియో మూవీ తర్వాత లోకేష్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో నాగార్జున , ఆమీర్ ఖాన్ ,  ఉపేంద్ర , శృతి హాసన్ నటించారు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి లోకేష్ కనకరాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా లోకేష్ కనకరాజు మాట్లాడుతూ ... గత రెండు సంవత్సరాలుగా కూలీ సినిమాపై తప్పితే వేరే దేనిపై కూడా ఇంట్రెస్ట్ చూపలేదు.

ఫ్రెండ్స్ , ఫ్యామిలీ దేనిపై కూడా ధ్యాస పెట్టకుండా ఈ రెండు సంవత్సరాలు ఈ సినిమా పైనే కాన్సన్ట్రేషన్ చేశాను. నా 36 వ మరియు 37 వ పుట్టిన రోజులను కూడా నేను జరుపుకోవాలని. ఈ సమయంలో నాకు ఇలాంటి జ్ఞాపకాలు అవసరం లేదు అనిపించింది అని లోకేష్ కనకరాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే కూలీ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lk