
ఇదిలా ఉంటే.. తాజాగా నజ్లెన్ యొక్క `మాలీవుడ్ టైమ్స్` మూవీ పూజా కార్యక్రమానికి ఫహద్ ఫాసిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఫహాద్ చేతిలో కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లను ఎలా వినియోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సెలబ్రిటీలైతే చాలా ఖరీదైన స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తుంటారు.
కానీ ఒక స్టార్ హీరో అయ్యుండి ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ వాడడం అనేది అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్ బ్రాండ్ ఏంటి? దాని ధర ఎంత? వంటి తెలుసుకునేందుకు నెటిజన్లు సోషల్ మీడియాలో సర్చింగ్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఫహాద్ చేతిలో ఉన్నది కీప్యాడ్ ఫోనే అయినప్పటికీ.. దాని ధర మాత్రం ఐఫోన్ కన్నా ఎక్కువ. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ `వెర్టు` తయారు చేసిన వెర్టు ఆసెంట్ టి ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్(Vertu Ascent Ti ferrari Nero Limited Edition) ఫోన్ ను ఫహాద్ వినియోగిస్తున్నాడు. 2008లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఖరీదు $1199. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే లక్ష రూపాయిలు పైనే. ఈ విషయం తెలిసాక నెటిజన్లకు ఫ్యూజులు ఔట్ అవుతున్నాయి.