"కమెడియన్ పద్మనాభం"..ఈ పేరు చెప్తే ఇప్పటి జనాలకి ఇప్పటి కుర్రాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చేమో. కానీ మన ఇంట్లో ఉండే నానమ్మలకి తాతలకి మాత్రం పద్మనాభం అనగానే  కామెడీతో బాగా నవ్విస్తారే ఆయనే కదా పద్మనాభం అని కచ్చితంగా మాట్లాడుకుంటారు . అలాంటి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు ఆయన.  పద్మనాభం తనదైన హాస్య స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించారు . ఆయన కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా ఉంటుంది .


మరీ ముఖ్యంగా మిస్సమ్మ , అప్పుచేసి పప్పుకూడు వంటి సినిమాలలో ఆయన కామెడి టైమింగ్ వేరే లెవెల్.  ఆయనలా కామెడీ ఎవరు చేయలేరు అని చెప్పాలి. అంతేకాదు రవితేజ హీరోగా నటించిన "భద్ర" అదే విధంగా రెబెల్ హీరో ప్రభాస్ నటించిన "చక్రం" సినిమాలలో ఆయన కనిపించి మెప్పించారు . పద్మనాభం 2010 ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో మరణించారు . ఆయన మరణం తెలుగు సినీ రంగంకి తీరని లోటు అంటూ ఎంతో మంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఆయన ఇండస్ట్రీలో లేకపోవడం ఎవరు తీర్చలేని లోటు అంటూ చెప్పుకొచ్చారు .



అయితే లెజెండ్రీ కమెడియన్ పద్మనాభం కొడుకు తెలుగులో కమెడియన్ గా రాణిస్తున్నారు అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన మరెవరో కాదు తిరుపతి ప్రకాష్ . తనదైన స్టైల్ లో కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించే తిరుపతి ప్రకాష్ చాలామంది కి సుపరిచితుడే. జబర్దస్త్ లో కూడా ఆయన కామెడీ చేశారు. సినిమాల్లోకి రావడానికి  పద్మనాభం పెదనాన్న సపోర్ట్ చేశారు అంటూ ఆయనే తెలిపారు . అంతేకాదు ఇండస్ట్రీ లోకి వచ్చాక ఆలీ ఎంతో సపోర్ట్ చేశారు అంటూ తెలిపారు తిరుపతి ప్రకాష్ . ఈ కామెడియన్ ఇప్పుడు పెద్దగా సినిమాలలో కనిపించట్లేదు.  కానీ ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా నవ్వుకుంటారు . అంతలా ఆయన కామెడీ టైమింగ్ తో కడుపుకు అభిమానులు నవ్వించారు తిరుపతి ప్రకాష్..!



మరింత సమాచారం తెలుసుకోండి: