ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.  అల్లు అర్జున్ - అఖిల్ సినిమా గురించి ఏ వార్త లీకైన ఏ అప్డేట్ వచ్చినా జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు. పుష్ప2 నే దానికి కారణమని చెప్పుకోవడంలో సందేహం లేదు.  అల్లు అర్జున్ కెరీర్ ని టర్న్ చేసిన సినిమా పుష్ప 2.  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్లాస్ట్ చేసింది . పుష్పరాజ్ మానియా వేరే లెవెల్ లో కుమ్మి పడేసింది .


అయితే ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా కన్ ఫామ్ అయ్యింది. పుష్ప2 కి మించి ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  దానికి తగ్గట్టే అట్లీ చాలా పక్కాగా ప్లాన్ డ్ గా ఈ సినిమా షెడ్యూల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేను చూస్ చేసుకున్నారు మూవీ మేకర్స్ . ఇది కూడా ఒక పెద్ద రాద్ధాంతం ఆయన విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.



అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో కాంట్రివర్షియల్  స్టార్ జాయిన్ అయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు "సత్యరాజ్".. సత్యరాజ్ అంటే నిన్న మొన్నటి వరకు చాలా బెస్ట్ ఇంప్రెషన్ నే ఉండేది . ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని నెగటివ్ గా మాట్లాడారో అప్పటినుంచి జనాలు సత్యరాజ్ ని విపరీతంగా హేట్ చేయడం విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు . హరిహర వీరమల్లు సినిమాలో కూడా సత్యరాజ్ పోర్షన్ ఎత్తేయాలి అంటూ పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు . కానీ అప్పటికే ప్రింట్ రెడీ అవ్వడంతో ఇక మేకర్స్ ఆ సీన్స్ తొలగించలేకపోయారు. ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ సినిమాలో సత్యరాజ్ ను పెట్టుకోవడం పెద్ద హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది. కావాలనే పవన్ కళ్యాణ్ ని తిట్టిన సత్యరాజ్ ని ఈ సినిమాలో జాయిన్ చేశారా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇది నిజంగా సినిమాకి బిగ్ హెడేక్ లా తయారవుతుంది అంటున్నారు జనాలు . మరి చూడాలి  అల్లు అర్జున్ - అట్లీ మూవీ టీం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: