టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకొని ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్2 సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 10వ తేదీన యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరగనుందనే  సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు ఊహించని స్థాయిలో అభిమానులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది యూట్యూబర్లు ఇప్పటికే వార్2 సినిమాను డబ్బింగ్ సినిమాలా ప్రొజెక్ట్  చేస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తారక్ సినిమాపై ఇంత పగేంటి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వార్2 సినిమా హిట్ కావడం యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా కోసం ఒక విధంగా చెప్పాలంటే తారక్ తన  కెరీర్ ను రిస్క్ లో పెట్టారు. అయితే కొంతమంది ఈ సినిమాపై కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ  సైతం ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు.

వార్2 సినిమా నుంచి తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమో సైతం ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో కిక్ ఇచ్చింది. సినిమా ఎండింగ్ లో వచ్చే  ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ గా నిలవబోతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వార్2 సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.  వార్2 వర్సెస్ కూలీ పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: