సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో రెండు సినిమాల్లో నటించినట్లయితే ఆ హీరో నటించిన రెండు సినిమాల విడుదల మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం స్టార్ హీరోలు నటించిన సినిమాలు తక్కువ రోజుల గ్యాప్ లో విడుదల అయినట్లయితే మొదట విడుదల అయిన సినిమా కంటే ఆ తర్వాత విడుదల అయ్యే సినిమాపై కాస్త ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అని ఉద్దేశంతో స్టార్ హీరోలు నటించిన సినిమాల విడుదల తేదీల మధ్య కాస్త ఎక్కువ రోజులు గ్యాప్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ మొదలు అయిన తర్వాత ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తాము అని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాకు అత్యంత భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయలేదు. కొంతకాలం క్రితమే చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టాడు. అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చిరంజీవితో మూవీ ని సూపర్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణం గానే అనిల్ ఈ సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నాడు.

ఆనూహ్యంగా విశ్వంబర మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ మూవీ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దానితో అక్టోబర్లో విశ్వంభర మూవీ విడుదల అయితే జనవరి నెలలో చిరు , అనిల్ మూవీ వచ్చినట్లయితే దానిపై కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దానితో చిరు , అనిల్ కాంబో మూవీ ని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి చిరు , అనిల్ కాంబోలో రూపొందుతున్న సినిమా చెప్పిన విధంగా  సంక్రాంతికి వస్తుందా ..? లేక విశ్వంబర మూవీ వల్ల పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: