సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్  కాంబోలో సినిమా ప్రకటించిన రోజు నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచింది. మోనికా  సాంగ్ రిలీజ్ తర్వాత కూలీ సినిమా కోసం బీ, సి సెంటర్స్ ఆడియన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూశారు.  మరి ఇంత  భారీ స్థాయిలో భారీ అంచనాలతో విడుదలైన కూలీ ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

తన స్నేహితుడు కూతురు ప్రీతి (శృతి హాసన్) ఒక ఆపదలో ఉందని తెలుసుకున్న హీరో ఆ ఆపద నుంచి ఆమెను రక్షించడానికి ఏం చేశాడు? సైమన్ ను హీరో ఎదుర్కోవడానికి గల కారణాలేమిటి?  ఈ ప్రయత్నంలో హీరోకు ఎవరెవరు సహాయ సహకారాలు అందించారు? సైమన్ ను ఈ కూలీ ఎలా ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు  పదుల వయస్సులో సైతం కూలీ సినిమాలో  అద్భుతంగా నటించి మెప్పించారు.  ఆయన నటన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఫిదా అయ్యేలా చేస్తుంది. నాగార్జున ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించారు.  ఈ తరహా పాత్ర నాగార్జునకు  కొత్తే  అయినప్పటికీ నాగ్ అభిమానులు మాత్రం ఈ పాత్రకు కనెక్ట్ కావడంతో పాటు ఈ రోల్ నాగార్జునకు పర్ఫెక్ట్ రోల్ అని చెబుతారు. ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ పాత్రల పరిధి మేర నటించి తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసారని  చెప్పవచ్చు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తెరపై కనిపిస్తే అభిమానులు మిగతా అంశాలను అస్సలు పట్టించుకోరు.  రజనీకాంత్ కు వీరాభిమాని అయినా లోకేష్ కనగరాజ్  సినిమాలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎక్కువ  సంఖ్యలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఎంత భారీ అంచనాలతో వెళ్లినా   నిరాశపరచకుండా కూలీ మూవీ అభిమానులకు పైసా వసూల్ మూవీ అనిపిస్తుందని  చెప్పడంలో సందేహం అవసరం లేదు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్  రొటీన్ కథనే ఎంచుకున్నా ఎలివేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. లోకేష్ కనగరాజ్  లియో సినిమాపై కొన్ని నెగటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.  అనిరుధ్  మ్యూజిక్, బీజీఎమ్  ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

సినిమాటోగ్రఫీ టాప్ రేంజ్ లో ఉండగా ఎడిటింగ్ విషయంలో మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే  బాగుండేది.  150 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కి ఉంటే  బాగుండేదని చెప్పవచ్చు. ఈ ఇండిపెండెన్స్ డే కూలీ సినిమాదే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

బలాలు :  రజనీకాంత్ నటన, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్,  అనిరుద్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే

బలహీనతలు : రొటీన్ స్టోరీ, ఎడిటింగ్

రేటింగ్ : 3.25/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: