మాస్ మహారాజా రవితేజ తన కెరియర్లో ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో , ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించాడు. రవితేజకు అద్భుతంగా కలిసి వచ్చిన పాత్రలలో పోలీస్ పాత్ర ఒకటి. రవితేజ ఇప్పటివరకు తన కెరీర్ లో నటించిన సినిమాలలో చాలా సినిమాల్లో పోలీస్ పాత్రలలో నటించాడు. అలా రవితేజ పోలీస్ పాత్రలలో నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన వెంకీ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. స్నేహమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో రవితేజ ట్రైయిని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మిరపకాయ్ సినిమాలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ "టచ్ చేసి చూడు" అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమా మాత్రం రవితేజ కు బాక్సా ఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. రవితేజ కొంత కాలం క్రితం క్రాక్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీనితో రవితేజ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి రవితేజ "మాస్ జాతర" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt