
సాధారణంగా సెలబ్రిటీలను ఫేవరెట్ ఫుడ్ గురించి అడిగితే ఏవేవో నోరు తిరగని పేర్లు చెబుతుంటారు. కానీ రామ్ చరణ్ కు మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా నమ్మలేరు. నిజానికి ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన రామ్ చరణ్ ఇండియన్ ఫుడ్ అందులోనూ దక్షిణాది ఫుడ్ కోసమే తపిస్తాడట. ఇంతకీ చరణ్ ఫేవరెట్ ఫుట్ ఏంటో తెలుసా? రసం రైస్ విత్ ఆమ్లెట్. ఈ కాంబినేషన్ అంటే ఆయనకు ప్రాణమట.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయాన్ని వెల్లడించింది. వేడి వేడి రసం అన్నంతో పాటుగా మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్స్ వేసిన ఆమ్లెట్ ఉంటే చాలు చరణ్ స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతాడని.. ఈ ఆహారం ఆయనతో పాటు ఎక్కడికైనా ప్రయాణిస్తుందని ఉపాసన తెలిపింది. కొన్నిసార్లు రసం, రైస్‌ను మిక్సర్ లో వేసి సూప్‌లా తయారు చేసుకుని కూడా తాగేస్తాడని ఉపాసన నవ్వుతూ పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు