తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ కి ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదల కాబోతుంది అంటే చాలు ఆ మూవీ విడుదలకు రెండు , మూడు రోజుల ముందే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇక సినిమా విడుదల రోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదల రోజు దియేటర్ల దగ్గర అదిరిపోయే రేంజ్ లో కోలా హలం నెలకొంటూ ఉంటుంది. అలాగే తారక్ నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాపు టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి.

ఒక వేళ సినిమాకు గనుక హిట్ టాక్ వచ్చినట్లయితే ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. అంతటి రేంజ్ క్రేజ్ కలిగిన తారక్ తాజాగా హిందీ సినిమా అయినటువంటి వార్ 2 మూవీ లో నటించాడు. ఈ మూవీ లో హిందీ నటుడు అయినటువంటి హృతిక్  రోషన్ కూడా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ మొదటి వీక్ డే అయినటువంటి సోమవారం రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విడుదల మొదటి నాలుగు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చిన ఐదవ రోజు మాత్రం ఈ సినిమా కనెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి షేర్ కలెక్షన్లు కూడా రానట్లు తెలుస్తోంది.  దానితో కేవలం విడుదల అయిన నాలుగు రోజులు మాత్రమే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లు వచ్చాయి. ఇలా ఈ సినిమా యొక్క కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీక్ డే అయినటువంటి ఐదవ రోజు చాలా వరకు పడిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: