
అందాల భామ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. ‘ఒక లైలా కోసం’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చివరిసారి ఆమె నటించిన తెలుగు సినిమా ‘ఆచార్య’. ఆ తర్వాత పూజ కొత్త ప్రాజెక్ట్‌లలో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ గ్యాప్‌లో పూజా ఎక్కువగా బాలీవుడ్, ఇతర భాషా సినిమాలపై దృష్టి పెట్టింది. రీసెంట్‌గా ఆమె చేసిన ‘రెట్రో’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఒక కీలక విషయం బయటపెట్టింది. తాను మళ్లీ తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని, ఒక లవ్ స్టోరీకి సైన్ చేసినట్లు ప్రకటించింది. ఈ వార్తతో ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. అందరూ ఆసక్తిగా ఆ కొత్త ప్రాజెక్ట్ ఏంటి ? హీరో ఎవరు అనే విషయాలపై చర్చ మొదలుపెట్టారు. మొదట్లో పూజా, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆ సినిమా ద్వారానే ఆమె రీఎంట్రీ అవుతుందని అందరూ భావించారు.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై మరో ట్విస్ట్ బయటకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో నటి శ్రుతి హాసన్, తాను దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పింది. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇదే సినిమాను పూజా చేస్తుందని ముందే రూమర్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు పరిస్థితి క్లారిటీ లేకుండా గందరగోళంగా మారింది. పూజా, శ్రుతి ఇద్దరూ ఆ సినిమాలో నటిస్తారా? లేక పూజా స్థానంలో శ్రుతి రీప్లేస్ అయ్యిందా ? అనే డౌట్స్ అభిమానుల్లో పెరిగిపోతున్నాయి. ఈ సినిమా విషయానికొస్తే, దర్శకుడు రవి నెలకుడితి మెగాఫోన్ పట్టుకోనుండగా, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయో తెలుసుకోవాలంటే అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా పూజా రీ ఎంట్రీ ఆశలపై శృతి నీళ్లు చల్లినట్లు అయ్యింది.