నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు మరో హీరో సపోర్ట్‌గా వస్తే, ఆ సినిమాకు సక్సెస్ ట్రాక్ ఇంకా పెరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్నవాళ్ల అభిప్రాయం. చాలా సందర్భాల్లో ఈ ఫార్ములా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పటికే ఎఫ్2 సిరీస్, వాల్తేరు వీరయ్య వంటివి బిగ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు "మెగా" అనిల్ సినిమాలో వెంకీ కూడా నటిస్తున్నారు. నో డౌట్, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టేస్తుంది. ఇక ఇప్పుడు అదే స్థాయిలో ముందుకు వెళ్తున్న మరో దర్శకుడు ఉన్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు . దర్శకుడు బాబీ. మరోసారి జాక్‌పాట్ కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ అందుకున్నాడు. అందరూ అనుకున్నట్లుగానే బాబీ తన నెక్స్ట్ సినిమాకి చిరంజీవితో కమిట్ అయ్యాడు. ఇది రస్టిక్ మాస్ యాక్షన్ సినిమా అని బిగ్ అనౌన్స్‌మెంట్‌తోనే చెప్పేశారు.


బాబీ స్టైల్ అంటే యాక్షన్ మస్ట్. డాకు మహారాజా, వాల్తేరు వీరయ్య .. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. వైలెంట్‌కి వైలెంట్‌గా ఉంటాయి. ఇక ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాలో కూడా అదే విధంగా వైలెన్స్ ఉంటుందని ఒక్క అనౌన్స్‌మెంట్‌తోనే తేలిపోయింది. కాగా, ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, బాబీ సినిమాల్లో గుర్తొచ్చేది స్పెషల్ సాంగ్. వాల్తేరు వీరయ్యలో "వేర్ ఇజ్ ది పార్టీ" సాంగ్ ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.



ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారింది. వాల్తేరు వీరయ్యకి దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకున్నారు. డాకు మహారాజ్ సినిమాకి అయితే సితార బ్యానర్ కావడం వల్ల ధమన్ ని తీసుకున్నారు అన్న కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఎవరు ఫైనల్ అవుతారు? మళ్లీ దేవిశ్రీ వైపు వెళ్తారా? లేక వన్స్ మోర్ అంటూ ధమన్ కే ఛాన్స్ ఇస్తారా? అనేది సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే అంశమే సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: