జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్2 సినిమా డిజాస్టర్ కావడంతో కెరీర్ విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తారక్ డ్రాగన్ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన డ్రాగన్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ అవుతాయంటూ ఒక వార్త వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న పోస్టర్ ను చూస్తే  ఈ పోస్టర్ మేకర్స్ నిజంగానే రిలీజ్ చేశారేమో అనే విధంగా ఉంది. అయితే అటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ ఇటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  వైరల్ అయిన వార్త నిజమై ఉంటే  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో  సంతోషించేవారు.

అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ విడుదల కావడానికి చాలా సమయం పట్టే  అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాకు  సంబంధించిన అప్ డేట్స్ ను ఇప్పుడే ఇవ్వాలని మేకర్స్ భావించడం లేదని తెలుస్తోంది. యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం లేదు. తారక్ సినిమాల్లో మరీ సీరియస్ గా కనిపిస్తున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

వార్2 సినిమాలో తారక్ యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గత సినిమాలను గుర్తు చేసే విధంగా ఉండటంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తారక్ కెరీర్ బెస్ట్ రోల్స్ ను  ఎంచుకుని సినిమాల విషయంలో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తారక్ కాలర్ సెంటిమెంట్ నిజం కాకపోవడం ఫ్యాన్స్ ను మరింత బాధ పెడుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: