సినిమా సెట్స్‌లో కోపంతో రెచ్చిపోవడం బాలయ్య బాబుకు చాలా అరుదు. సాధారణంగా సినిమా సెట్స్ లో ఆయన చాలా ఓపికగల వ్యక్తిగా ఉంటారు. కానీ ఒకసారి కోపం వచ్చిందంటే ఇక ఆ కోపం కాస్తా తుఫాన్‌లా మారిపోతుంది. బాలయ్య గారికి డిసిప్లిన్ అంటే ప్రాణం, ముఖ్యంగా టైం సెన్స్ విషయంలో ఆయనకు అస్సలు రాజీపడడం ఉండదు. ఈ విషయం ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. సెట్‌లో ఎవరైనా చిన్న తప్పు చేసినా, షూటింగ్ ఆలస్యమైయినా బాలయ్య సీరియస్ అవుతారు కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం ఆయన చాలా సహనంగా ఉంటారు. అయితే ఒక సినిమా సమయంలో బాలీవుడ్ నుండి వచ్చిన ఒక స్టార్ హీరోయిన్ చేసిన అతి వల్ల బాలయ్య ఆగ్రహం ఎక్కువ అయిపోయింది.


అప్పట్లో బాలయ్య ఒక  సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ కాకుండా రెండో హీరోయిన్‌గా నటించడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారు. సినిమా షెడ్యూల్స్ ఇప్పటికే పలు కారణాల వలన ఆలస్యమవుతున్నాయి. మేకర్స్‌పై భారీ ఫైనాన్షియల్ ప్రెజర్ పెరుగుతోంది. ఎలాగైనా షెడ్యూల్ త్వరగా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని అందరూ ఆలోచిస్తున్న సమయమది. అప్పుడు ఈ బాలీవుడ్ హీరోయిన్ ప్రవర్తన మాత్రం అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టింది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నా కూడా ఆమె ముంబై నుంచి ఆలస్యంగా వస్తోంది. షూటింగ్ స్పాట్‌కి చేరుకున్న తర్వాత మేకప్, కాస్ట్యూమ్స్ పేరిట గంటల తరబడి టైమ్ వృథా చేస్తోంది. ఆ తర్వాత కూడా ఫ్రెండ్స్‌తో కారవాన్‌లో కూర్చుని , గాసిప్‌లు, నవ్వులు పంచుకోవడం వంటివి చేయడం మొదలుపెట్టింది. దీంతో షూటింగ్ స్పాట్‌లో ఉన్న టెక్నీషియన్స్, డైరెక్టర్, మేకర్స్ అందరూ ఇబ్బందిపడిపోయారు. టైమ్ విలువను బాగా అర్థం చేసుకునే బాలయ్యకు ఇది అసలు నచ్చలేదు. సినిమా ఆలస్యమవడం వల్ల నిర్మాతలు డబ్బు ఇబ్బందులు పడతారని ఆయనకి కోపం మూడింతలైంది.


సెట్‌లోకి వెళ్లిన బాలయ్య, "ఈ సినిమా నుండి ఆమెను తీసేయండి! వేరే హీరోయిన్‌ను తీసుకొండి!" అని డైరెక్టర్, నిర్మాతల ముందే గట్టిగా కసిరేశారట. బాలయ్య కోపం అంతటితో ఆగలేదు. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది సినిమా పరిశ్రమలో ఎంత ముఖ్యమో ఆయన అందరికీ గుర్తు చేశారు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే సెట్స్‌లోకి వచ్చి తన సీన్స్ అన్నింటినీ పూర్తి చేసిందట. అయితే అప్పటికే సినిమాలో ఆమె పాత్రను పెద్దగా కట్ చేశారు. ఫైనల్ కట్‌లో ఆ హీరోయిన్ పాత్ర చాలా తక్కువగా మిగిలిపోయింది. ఆ సంఘటన అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. "బాలయ్య అంటే మాటకు కట్టుబాటు, నిజాయితీ" అని అందరూ మాట్లాడుకున్నారు. ఆయనకున్న క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం అందరికీ ఒక పాఠం అయ్యింది. ఆ సంఘటన తర్వాత చాలా మంది నటీనటులు టైమ్ సెన్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: