సినిమా ఇండస్ట్రీ లో హిట్టు వచ్చింది అంటే చాలు అద్భుతమైన క్రేజ్ వస్తుంది. హిట్ దక్కిన నటీ మణులకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి. హిట్టు దక్కిన తర్వాత వరుస పెట్టి ఆఫర్లు వస్తాయి. వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి కదా అని అన్ని సినిమాలను ఓకే చేస్తూ పోతే ఆ మూవీ ల ద్వారా విజయాలను అందుకున్నట్లయితే వారు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుతారు. అదే ఆ సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా వారి క్రేజ్ తగ్గిపోయి ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి.

ఇకపోతే కెరియర్ ప్రారంభించిన కొత్త లోనే ఒక అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ ను యూత్ ఆడియన్స్ లో సంపాదించుకొని ఆ తర్వాత మరో విజయాన్ని కూడా అందుకొని ఆ క్రేజ్ ను పెంచుకున్న ఓ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఈమె క్రేజ్ భారీగా తగ్గిపోయి ప్రస్తుతం చేతిలో పెద్దగా క్రేజీ సినిమాలే లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తోంది. ఇంతకు ఆ నటిమణి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిమణి హెబ్బా పటేల్. 

ఈమె కెరియర్ను ప్రారంభించిన కొత్త లోనే కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఈ మూవీ లో ఈమెకు సూపర్ సాలిడ్ స్కోప్ ఉన్న పాత్ర దొరకడం , అందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇక ఈమె నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటి క్రేజ్ భారీగా పెరిగింది. దానితో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి చాలా ఈజీగా చేరుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ కావడంతో ఈమె క్రేజ్ భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఈమె పరవాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: