ఏంటి టాలీవుడ్ లో కలెక్షన్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మిరాయ్ మూవీ కాపీ సినిమానా.. కృష్ణ హిట్ సినిమాని కాపీ చేసి మిరాయ్ తీశారా.. ఇంతకీ సోషల్ మీడియాలో వస్తున్న ఓ రూమర్స్ లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయయ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది అని సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. అంతేకాదు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయని, ఇన్ని రోజులు ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోతుంటే మిరాయ్ మూవీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి అంటూ చాలామంది సంతోషపడుతున్న వేళ మిరాయ్ మూవీపై ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

 మిరాయ్ మూవీ కృష్ణ నటించిన మహాబలుడు మూవీకి కాపీ అని,అచ్చం మహాబలుడు మూవీని డైరెక్టర్ మిరాయ్ మూవీగా దింపేశారు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని వల్లభనేని రవి అనే ఒక నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో బయటపెట్టారు. మిరాయ్ మూవీ మహాబలుడు మూవీకి కాపీ అంటూ ట్వీట్ పెట్టాడు.అయితే ఆ నెటిజన్ ట్వీట్ పెట్టడంతోనే క్షణాల్లో ఆ ట్వీట్ వైరల్ అయ్యి చాలా మంది నెటిజన్లు ఆ ట్వీట్ ని సమర్థిస్తున్నారు. బొంగులో మిరాయ్ మొత్తం కృష్ణ హిట్ సినిమాని కాపీ చేసి ఏదో పెద్ద గొప్ప చేసినట్టు చెప్పుకుంటున్నారు అంటూ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ అయితే కార్తీక్ ఘట్టమనేని త్రివిక్రమ్ శిష్యుడా ఏంటి..అందుకే కాపీ సినిమా చేశాడు అంటూ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్వీట్ లు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. 

ఇక మరికొంతమంది మాత్రం మిరాయ్ మూవీ మీద వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ ని ఓర్వలేక ఇలా సోషల్ మీడియాలో నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.మిరాయ్ మూవీ మహాబలుడు ఈ రెండు సినిమాలు వేరు వేరు అంటూ కొట్టి పారేస్తున్నారు.తన తండ్రి సినిమాను కాపీ చేశాడనే తేజ సినిమాకి మహేష్ బాబు సపోర్ట్ చేయడం లేదు. బాలీవుడ్ లో వచ్చిన సైయారా లాంటి మూవీ కి బాగుందని సపోర్ట్ చేసిన మహేష్ బాబు టాలీవుడ్ లో వచ్చిన తేజ  సినిమా హిట్ అయితే ఎందుకు సపోర్ట్ చేయడం లేదు ఇదే కారణం అంటూ ఇలా మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే మిరాయ్ మూవీ మహాబలుడు మూవీకి కాపీనా..ఈ వార్తలపై డైరెక్టర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: