టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీ రోగా సినిమా చేసి చాలా కాలమే అవుతుంది.  నాగ్ ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నాగార్జున పలు సినిమాలలో కీలక పాత్రలలో , విలన్ పాత్రలో నటించాడు. కానీ సోలో హీరోగా మాత్రం ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నాగర్జున మరికొన్ని రోజుల్లోనే తన 100 వ సినిమాను ప్రారంభించబోతున్నట్లు , ప్రస్తుతం ఆయన తన 100 వ సినిమా పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే తన 100 వ సినిమాకు సంబంధించిన అన్ని పనులను నాగార్జున పూర్తి చేసుకున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున తన 100 వ సినిమా విషయంలో మనం సినిమా ఫార్ములా ను ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన మనం సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అక్కినేని నటులు అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున నాగ చైతన్య , అక్కినేని అఖిల్ నటించారు.

నాగర్జున 100 వ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య , అఖిల్ కూడా చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే నాగార్జున 100 వ సినిమాలో నాగ చైతన్య , అఖిల్ కూడా చిన్న చిన్న క్యామియో పాత్రల్లో నటించినట్లయితే ఈ సినిమా నాగార్జున అభిమానులకు అదిరిపోయే రేంజ్ ట్రీట్ లాగా ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో నాగార్జున "కుబేర" ఓ సినిమాలో కీలక పాత్రలో నటించగా , కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాలలోని నాగార్జున నటనకు ప్రేక్షకుల , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: