
ఒక సినిమా టికెట్ ధర ఈ రేంజ్ లో పెరగడం ఇదే మొదటిసారి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఓజి సినిమా ధరలపైన స్పందించారు. ఓజి సినిమా టికెట్ల ధరలు ఇంతలా పెంచడం సరైనది కాదు అంటూ హెచ్చరించారు. ఈ బాధ్యతను నిర్మాత డివివి దానయ్యతో పాటు ఫిలిం ఛాంబర్ కౌన్సిలర్ వారిదే బాధ్యత అంటూ తెలియజేశారు. ఎవరైతే ఈ టికెట్ ధరలు పెంపులో భాగంగా ఉన్నారో వారందరూ తప్పులో భాగస్వాములయ్యారంటు తెలియజేశారు.
సినిమా టికెట్లను ఇలా ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచితే సినీ పరిశ్రమ చాలా నష్టపోతుందంటూ హెచ్చరించారు. ఇలా పెంచడం వల్ల ప్రేక్షకులు ఓటీటి ,పైరసీలకే అలవాటు పడుతున్నారని అసహనాన్ని తెలియజేశారు. సినిమా టికెట్లు ధరల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగనే కరెక్ట్ అంటూ హెచ్చరించారు. బడ్జెట్ను బట్టి టికెట్ల ధరలను నిర్ణయించేవారు.. కానీ ఇప్పుడు సినిమా థియేటర్ల ధరలు పెంచి ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా చేస్తున్నారని.. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో ధరలు ఎలా ఉన్నాయో చూసి నేర్చుకోవాలని మాట్లాడారు.
సినిమా టికెట్లు ధరలు పెంచిన ఈ ప్రభుత్వాలు పేద రైతులకు అండగా నిలబడలేదంటూ తెలిపారు నట్టి కుమార్. రైతులకు కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి ఉంది. ఒక సినిమాకి మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం ఉల్లి, టమోటా వంటి రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అంటూ మాట్లాడారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి విషయాలను గ్రహించాలి అంటూ తెలిపారు నట్టి కుమార్.