పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ  తర్వాత తెర పైన కనిపించబోతున్నారు.  కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై శ్రద్ధ పెట్టిన పవన్ చివరికి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి చరిత్ర సృష్టించారు. అలాంటి పవన్ కళ్యాణ్ తనకు దొరికిన టైంలో OG సినిమాను పూర్తి చేశారు. అయితే ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుండడంతో ఓజి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి ఈ ఈవెంట్ కు ఎంతో మంది అభిమానులు వచ్చారు. కుండపోత వర్షం అయినా సరే పవన్ కోసం నిలబడి ప్రోగ్రాం అయిపోయే వరకు ఉన్నారు.

 అంతేకాకుండా పవన్ కళ్యాణ్ OG సినిమా తొలి టికెట్ ను లక్షల రూపాయలకు పెట్టి  వేలం పాట కూడా పాడారు. అభిమానులు పవన్ కోసం ఇంత చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అభిమానుల కోసం తానున్న హోదాను మరిచిపోయి మరీ వారిలో సంబరాన్ని నింపారు. ముఖ్యంగా ఓజీ చిత్రంలో తాను వాడిన డ్రెస్ నే వేసుకొని, సినిమాలో వాడినటువంటి కత్తిని పట్టుకొని, సినిమాలో  ఏ విధంగా యాక్ట్ చేశారో ఆ విధంగానే ఈ స్టేజిపై కూడా కనిపిస్తూ డైలాగులు వదిలారు. తాను ఒక డిప్యూటీ సీఎం  అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. దీంతో అభిమానులు వర్షం వచ్చినా కానీ అదంతా మర్చిపోయి తమ అభిమాన హీరోను చూస్తూ మురిసి పోయారు.

అంతేకాదు ఇంకో పక్కన సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ ని కూడా ఆయన ఉపయోగించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాజకీయ వేదికల్లో  పవన్ కళ్యాణ్  ఏ విధంగా మాట్లాడతారో ఆ డైలాగును ఇక్కడ కూడా ఉపయోగించారు. "తొక్కి పడేస్తాం,  మా సంగతి ఏంటో తెలియదు, ఎవడ్రా మనల్ని ఆపేది" అంటూ డైలాగులు విసిరారు. అయితే ఈ డైలాగ్స్ OG చిత్రంలో కూడా జపనీస్ భాషలో విలన్ కు వ్యతిరేకంగా పెట్టినట్టే కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఆయన రాజకీయాల్లోనే కాకుండా సినిమాలో కూడా జగన్ పై కక్ష్య సాధించేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: