సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ కొంతమంది హీరోలు  స్టార్లుగా ఎదగలేకపోతున్నారు. మరి కొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా మారుతున్నారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలంటారు. అయితే ఈ అదృష్టం అనేది అల్లు ఫ్యామిలిలో  ఆయనకు ఒక్కరికి మాత్రమే ఉన్నట్టు కనిపిస్తోంది. అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యారు. కానీ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఇప్పటికి ఎదగలేక పోతున్నారు. అయితే ఆయన ఇండస్ట్రీలోకి  గౌరవం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. 

అలా ఒక్క క్షణం,ఏబిసిడి,ఊర్వశివో రాక్షసివో,బడ్డీ వంటి సినిమాలు చేశాడు. కానీ ఇప్పటికి స్టార్ హీరో కాలేకపోతున్నారు. అలాంటి అల్లు శిరీష్ తోటి హీరోలైనటువంటి రామ్ చరణ్,వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారయ్యారు.  అయితే సినిమాల్లో పెద్దగా పాపులారిటీ లేకపోయినా  అల్లు శిరీష్ కు తాత తండ్రి సంపాదించిన  ఆస్తులు అయితే ఎక్కువగానే ఉన్నాయి.. అయితే ఆయన త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హైదరాబాద్ కు చెందినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తెతో శిరీష్ కు పెళ్లి చేయాలని పెద్దలు కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం.కానీ ఇంత లోనే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించడంతో అల్లు శిరీష్ పెళ్లి వాయిదా వేశారని తెలుస్తోంది. మరి ఆమె సంవత్సరికం అయిపోయిన తర్వాత అల్లు శిరీష్ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ముందు ముందు తెలియబోతోంది. ఇక బడ్డీ సినిమా తర్వాత అల్లు శిరీష్ నుంచి మరో ప్రాజెక్టు అనౌన్స్ కాలేదు. మరి చూడాలి ఈ గ్యాప్ లో ఆయన ఏదైనా సినిమా చేస్తారా అనేది రాబోవు రోజులో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: