ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల అయింది అంటే చాలు ఆ మూవీ లకు హిట్ , ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా మొదటిbరోజు అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక మొదటి రోజు వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే సాధారణం గానే రెండవ రోజు ఎంతో కొంత శాతం కలెక్షన్లు డ్రాప్ అవుతాయి. కానీ మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు చాలా తక్కువ శాతం కలెక్షన్లు డ్రాప్ అయినట్లయితే ఆ మూవీ లకు లాంగ్ రన్ ఉంటుంది అని , ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేస్తాయి అని అంచనాకు ట్రేడ్ పండితులు వస్తూ ఉంటారు.

మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్ల మధ్య డ్రాప్ భారీ ఎత్తున ఉన్నట్లయితే ఆ సినిమాలు పెద్ద ఎత్తున కలెక్షన్లను లాంగ్ రన్ లో వసూలు చేయడం కష్టం అని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతూ ఉంటారు. ఇకపోతే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 90.91 కోట్ల షేర్ ... 145 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇక మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో డ్రాప్ అయ్యాయి. రెండవ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 17.41 కోట్ల షేర్ ... 28.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు సినిమా కలెక్షన్లు భారీగా డ్రాప్ కావడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుంది ... ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుంది అనే విషయంపై చాలా మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: