
ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ నమోదు చేసింది. కన్నడ, తెలుగు వెర్షన్లు అక్కడ ఈక్వల్‌గా వసూళ్లు రాబడుతున్నాయి. రిలీజ్ మొదటి రోజు నుంచే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పటికే 6 లక్షల డాలర్ల మార్క్ దాటేసింది. ఈ స్పీడ్‌ను బట్టి చూస్తే, త్వరలోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది రిషబ్ శెట్టికి మాత్రమే కాకుండా, హోంబళే ఫిల్మ్స్ బ్యానర్‌కీ మరో బిగ్ మైలురాయిగా నిలవనుంది.
“కాంతార” మొదటి భాగం సాధించిన విజయాన్ని అందరూ గుర్తుంచుకుంటారు. దాని తర్వాత వస్తున్న ఈ ప్రీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ నుంచే మాస్, క్లాస్ ఆడియెన్స్ రెండింటికీ బలమైన కనెక్ట్ ఏర్పడింది. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం, బి.అజయ్ వినాయక్ రూపొందించిన విజువల్స్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. దసరా సెలవులు, వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ టాక్, పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఇవన్నీ కలిసొచ్చి “కాంతార చాప్టర్ 1”ను మరింత బ్లాక్‌బస్టర్ హిట్ చేయనున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు