పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఓజీ” ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్, భారీ స్కేల్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ, బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ఇండియాలో 300 కోట్ల దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం, విదేశాల్లోనూ అదే స్థాయిలో హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో ఓజీ అద్భుతమైన స్టడీ రన్ చూపిస్తోంది. రిలీజ్ వారం రోజుల్లోనే అక్కడ 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఓజీ ఇప్పుడు 5.3 మిలియన్ డాలర్లను దాటేసింది.


ఇది పవన్ కళ్యాణ్ సినిమాలకు యూఎస్ మార్కెట్‌లో ఉన్న భారీ క్రేజ్‌కు నిదర్శనం. ఓజీ ఇండియా వైడ్‌గా రెండో వారంలో కాస్త స్లో అయినా కూడా ఓవ‌ర్సీస్‌లో మాత్రం త‌న దూకుడు అలాగే కంటిన్యూ చేస్తోంది. ఈ వ‌సూళ్లు వ‌చ్చే వీకెండ్‌లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. సెలవులు, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, యాక్షన్ ప్యాక్డ్ కంటెంట్ అన్నీ క‌లిసి సినిమా వసూళ్లను మరింతగా పెంచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫైనల్ రన్‌లో ఓజీ యూఎస్‌లో ఎక్కడ ఆగుతుందో, ఎలాంటి మైలురాళ్లు అందుకుంటుందో చూడాల్సి ఉంది.


థమన్ అందించిన సంగీతం, రవిశంకర్ విజువల్స్, సుజీత్ స్టైలిష్ మేకింగ్ అన్నీ కలిసి సినిమాకు పెద్ద ప్ల‌స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కలిపి, ఓజీ నిజమైన పాన్ ఇండియా రేంజ్‌లో నిలిచిన సినిమా ఇది అని ప‌వ‌న్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసుకుని చెపుతున్నారు. ఫైన‌ల్‌గా యూఎస్ మార్కెట్‌లో పవన్ పవర్ మరోసారి నిరూపితమైంది. స్టడీగా కొనసాగుతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత ఎత్తుకు వెళ్తుందో సినీ వర్గాలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: