టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో శ్రీకాంత్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన శ్రీకాంత్ ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరో పాత్రలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ ఎక్కువ శాతం సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో , విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ తనయుడు అయినటువంటి రోషన్ ఇప్పటికే సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈయన నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పెళ్లి సందD అనే సినిమాలో నటించాడు. పెళ్లి సందD సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. కానీ ఈ మూవీ తర్వాత రోషన్ తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్లు ఏవి పెద్దగా బయటకి రావడం లేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన ఓ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సినిమాలో హీరో గా నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... హిట్ సిరీస్ మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో రోషన్ హీరో గా నటించబోతున్నట్లు , ఇప్పటికే ఈ కాంబో లో మూవీ ఫిక్స్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు , ఈ మూవీ ని సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: