ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు  చేసుకుంటున్నాయి. మెడికల్ కాలేజీలను PPP విధానంలో పూర్తి చేయాలంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ ఈ విషయం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఇదివరకే టెండర్ల ద్వారా వాటిని తీసుకున్న తాము అధికారంలోకి వచ్చిన తరువాత అన్నిటిని తీసేసుకుంటామంటూ ఒక గట్టి హెచ్చరిక తెలియజేశారు. అయినా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జగనే స్వయంగా నిరాహార దీక్షలో పాల్గొనబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వేదిక కూడా ఫిక్స్ చేసినట్లు తెలిసింది.



రాష్ట్రంలో మెడికల్ కళాశాల పైన కూటమి ప్రభుత్వం పిపిపి విధానంలో ముందుకు వెళ్లడంతో ఈ నిర్ణయాన్ని వైసిపి పార్టీ వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం పైన నిరసనలు కూడా చేస్తామని హెచ్చరించినప్పటికీ ప్రభుత్వ ముందుకు వెళితే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలను స్వాధీనం చేసుకుంటామంటూ తెలియజేశారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలకు సంబంధించి అటు వైసిపి, కూటమి నేతల మధ్య సోషల్ మీడియా ఒక వార్ నడిచింది .ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాల పర్యటించబోతున్నారు. అలాగే నర్సీపట్నం మెడికల్ కాలేజీలను కూడా సందర్శించే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు.


తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం గురించి అందుకు సంబంధించిన పనుల గురించి మాజీ సీఎంతోపాటు, పార్టీ నేతలు కూడా వివరించారు.. ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని కోరుతున్నప్పటికీ వీటిలో పది కాలేజీలను ప్రైవేటుపరంగా  చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ వంటి వాటిపైన కూడా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ స్వయంగా మెడికల్ కాలేజీలను సందర్శించి తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను వాటి లక్ష్యాలను వివరించబోతున్నారు. రాష్ట్రస్థాయిలో ధర్నాకు కూడా సిద్ధం అవ్వబోతున్నట్లు తెలిసింది.ఇందుకు సంబంధించి రాజమండ్రి లేదా నంద్యాలలో ఈ ధర్నా ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: