టాలీవుడ్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు తెలియని వారు ఉండరు. గతంలో సినిమాలతో హాట్ టాపిక్ గా ఉన్న హేమ ఈ మధ్యకాలంలో పలు వివాదాల ద్వారా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అలాగే గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయింది. అంతేకాదు ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు రూమర్లు కూడా వినిపించాయి. ఇక ఈ రూమర్ల కారణంగా హేమ చాలా సందర్భాలలో ఈ విషయాన్ని చెప్పుకొని బాధపడింది. అయితే అలాంటి హేమ స్టార్ హీరో అయినటువంటి నాగార్జున ని తన కూతురు ఫంక్షన్ నుండి వెళ్లగొట్టిందట. మరి అంత పెద్ద స్టార్ హీరోని హేమ కూతురు ఫంక్షన్ కి వస్తే ఎందుకు వెళ్ళగొట్టింది.. కారణం ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకుందాం.

నాగార్జున నటించిన చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే సినిమాల్లోనే కాదు బయట కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందట. ముఖ్యంగా వీరి మధ్య అనుబంధంతో హేమ తన కూతురి ఫంక్షన్ కి నాగార్జునని ఆహ్వానించిందట.అయితే ఈ ఫంక్షన్ కి నాగార్జున తన భార్య అమలతో కలిసి వచ్చారట.ఫంక్షన్ కి వచ్చి గంటన్నర సేపు నాగార్జున అక్కడే ఉన్నారట. కానీ సడన్గా హేమ మాత్రం అక్కడి నుండి నాగార్జునని ఇంటికి పంపించేసిందిట. అయితే దానికి కారణం ఉంది.

ఎందుకంటే నాగార్జున ఆ ఫంక్షన్ కి వస్తే చాలామంది హేమ బంధువులు ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారట.ఈ కారణంతో ఆయన కాస్త ఇబ్బంది పడడంతో ఇదంతా గమనించిన హేమ నాగార్జున గారు మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి.ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి పంపించిందట.అయితే నాగార్జున అక్కడికి వచ్చిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చి మరీ కొంతసేపు అక్కడ ఉండాలనుకున్నారట. కానీ ఆయన బాధ చూడలేక హేమా ఆయన్ని ఇంటికి పంపించిందట.ఇక ఈ విషయాన్ని స్వయంగా హేమ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: