ఇప్పటివరకు మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే రాజకీయాల్లో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన నటులు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ నటన రంగం నుండి రాజకీయంలోకి వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి వరకు చేరిన వ్యక్తులలో కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే ఉంటారు. ఆయన సినిమా రంగంలో అద్భుతమైన స్థాయికి ఎదిగి , ఆ తర్వాత తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి , పార్టీని స్థాపించిన తక్కువ కాలంలోనే ప్రజల మనసును గెలుచుకొని అద్భుతమైన అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న కోవడం మాత్రమే కాకుండా ముఖ్య మంత్రి కూడా అయ్యారు.

ఇక ఆ తర్వాత ఎంతో మంది సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ముఖ్యమంత్రి మాత్రం కాలేదు. నందమూరి తారక రామారావు గారి అనంతరం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారు స్వీకరించారు. అందులో భాగంగా ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఎన్టీఆర్ వారసుడు అయినటువంటి బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్న ఆయన చంద్రబాబుకు సహాయం చేయడం తప్ప ఎప్పుడూ ముఖ్యమంత్రి కావాలి అనుకోలేదు. ఇక చంద్రబాబు తర్వాత కూడా ఆయన కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనే వాదననే ఎక్కువగా వినిపిస్తుంది. అలాంటి సమయంలో నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎవరైనా ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అని నందమూరి అభిమానులు గట్టిగా వాదనను వినిపిస్తున్నారు.

అలాంటి సమయంలో నందమూరి కుటుంబంలో మంచి క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ కలిస్తే బాగుంటుంది అనే వాదనను వారి అభిమానులు గట్టిగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అనే వాదన వినిపిస్తుంది. దానిని పక్కన పెట్టి వీరిద్దరూ కలిస్తే బాగుంటుంది అని నందమూరి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: