- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల పద్మవ్యూహంలోకి దిగిపోతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బిఆర్ఎస్ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. సునీత ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే 2009 నియోజకవర్గాల పునర్విభ‌జ‌న‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికలలో దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికలలోను మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.


రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2018 ఎన్నికలలో ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గోపీనాథ్ రెండోసారి బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 లో జరిగిన సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే జూబ్లీహిల్స్ లో మాత్రం గోపీనాథ్ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఆకస్మిక మృతితో తొలిసారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. గత మూడు ఎన్నికలలోను హ్యాట్రిక్ విజయాలు సాధించిన. గోపీనాథ్ తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి రాబోతున్నారు. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించగా.. ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలిచినా 12 సంవత్సరాల తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి కొత్త ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. మరి ఆ రికార్డు ఎవరు సొంతం చేసుకుంటారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: