
నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ 2 - తాండవం సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాపై కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. రికార్డ్ స్థాయిలో జరుగుతోందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ ప్రాంతంలో బాలయ్యకు సన్నిహితుడైన డిస్ట్రిబ్యూటర్ రూ. 24 కోట్లుకి ఈ సినిమా రైట్స్ కొన్నారని టాక్ ? ఇక నైజాంలో రూ. 30 కోట్లు, ఆంధ్రలో సుమారు రూ. 55 కోట్లు వరకు డీల్ అవుతున్నాయట. మొత్తంగా ఇది బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్.
పై బిజినెస్ లెక్కలు చూస్తుంటే అఖండ 2 - తాండవం సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది. ముందుగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. డిసెంబర్ రిలీజ్ మిస్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ సినిమాల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. సింహా - లెజెండ్ - అఖండ ఒక దానిని మించి సూపర్ హిట్లు మరొకటి కావడంతో అఖండ 2 తో మరోసారి మ్యాస్ ర్యాంపేజ్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.