సినిమా అంటే కేవలం తెరపై కథ కాదు, అనుభూతి కూడా. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న కొద్దీ థియేటర్ అనుభవం కూడా అప్‌గ్రేడ్ అవుతోంది. తాజాగా పీవీఆర్ - ఐనాక్స్ సంస్థ తీసుకున్న కొత్త ఆలోచన దీనికి ఉదాహరణ. సాధారణంగా ఇంట్లో భోజనం చేస్తూ టీవీ చూడటం, లేదా థియేటర్‌లో పాప్‌కార్న్ తింటూ సినిమా ఎంజాయ్ చేయడం మన‌కు అలవాటు. కానీ ఇప్పుడు ఈ రెండు అనుభవాలను కలిపి ఒక కొత్త కాన్సెప్ట్‌ను తెచ్చింది పీవీఆర్-ఐనాక్స్. బెంగళూరులోని ఎం5 సిటీ మాల్‌లో ఉన్న ఎనిమిది స్క్రీన్లలో ఒకదాన్ని పూర్తిగా డైనింగ్ థియేటర్గా మార్చేశారు. అంటే ఇక్కడ ప్రేక్షకులు రెస్టారెంట్‌లో కూర్చున్నట్టే టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేస్తూ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీగా లేదా ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ అండ్ మూవీ అనుభవం ఒకే సారి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.


ధరలు మాత్రం కొంచెం ప్రీమియంగా ఉన్నాయి. “కాంతార చాప్టర్ 1” సినిమాను నలుగురు కలిసి చూడాలంటే సుమారు రు. 1340 చెల్లించాలి. ముగ్గురికి రు. 820, ఇద్దరికి రు. 740 వరకు ఖర్చవుతుంది. ఇవన్నీ బుకింగ్ ఛార్జీలు మినహాయించి..! కానీ ఆ అద్భుతమైన డైనింగ్ అండ్ సినిమాటిక్ అనుభవం కోసం ఈ ధర చెల్లించేందుకు ప్రేక్షకులు వెనుకాడడం లేదు. టికెట్లు ముందుగానే అమ్ముడుపోతున్నాయట. కొంతమంది “తినడంలో దృష్టి పెట్టి సినిమా మిస్ అవుతామేమో” అంటున్నా చాలా మంది మాత్రం ఈ కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ విజయవంతమవుతుందని భావిస్తూ, దేశవ్యాప్తంగా మరో ఐదు నుంచి ఆరు నగరాల్లో త్వరలో ఇలాంటి డైనింగ్ థియేటర్లు ప్రారంభించడానికి పీవీఆర్-ఐనాక్స్ సిద్ధమవుతోంది. సినిమా చూడడం అంటే ఇక భవిష్యత్తులో కేవలం విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా పూర్తి లగ్జరీ అనుభవం కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: