
ఇక ఇప్పుడు అందరి నోటి ఒకటే మాట — రష్మిక ఇంత పిక్ స్టేజీలో ఉండగానే ఎందుకు నిశ్చితార్థం చేసుకుంది..? అనేదే. రష్మిక ప్రస్తుత పరిస్థితిలో టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో కూడా అత్యంత బిజీ మరియు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో నిశ్చితార్థం నిర్ణయం తీసుకోవడం ఎందుకని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే సాధారణంగా హీరోయిన్ నిశ్చితార్థం చేసుకుంటే లేదా పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గిపోతాయన్న భావన ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆమెకు కొన్ని పరిమితులు విధిస్తారన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక తీసుకున్న నిర్ణయం నిజంగా బోల్డ్ అని చెప్పాలి.
అయితే, ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం — రష్మిక ఒక స్పెషల్ కండిషన్ మీదే నిశ్చితార్థం చేసుకుందట. ఆ కండిషన్ ఏమిటంటే, పెళ్లి తర్వాత కూడా ఆమె తన కెరీర్‌ని యథావిధిగా కొనసాగించాలి, సినిమాలు చేయడంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని ముందుగానే చర్చించుకుందట. విజయ్ దేవరకొండ కూడా ఈ కండిషన్‌కి అంగీకరించాడని, రష్మిక కెరీర్‌కి పూర్తిగా సపోర్ట్ చేస్తానని చెప్పాడని వార్తలు వస్తున్నాయి.ఇంకా రష్మిక తల్లిదండ్రులు, విజయ్ తల్లిదండ్రులు కూడా ఈ విషయం గురించి ముందుగానే మాట్లాడుకున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి కుటుంబాలు కూడా ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపినట్లు సమాచారం.
ఫ్యాన్స్ మాత్రం ఈ జంటపై ప్రేమతో మునిగిపోయారు. “ఇంత అందమైన జంట మరొకటి లేదు”, “విజయ్ ఇచ్చిన సపోర్ట్ నిజంగా గొప్ప విషయం”, “రష్మిక తన కెరీర్‌తో పాటు లైఫ్‌కి కూడా బలమైన నిర్ణయం తీసుకుంది” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం సినీ ప్రపంచం వీరిద్దరి పెళ్లి తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఎప్పుడు, ఎక్కడ ఈ లవ్లీ కపుల్ వివాహ బంధంలోకి అడుగుపెడతారో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. రష్మిక ధైర్యం, విజయ్ సమర్థన, ఇద్దరి మద్య ఉన్న బంధం — ఇవన్నీ కలిసి ఈ జంటను టాలీవుడ్‌లోనే కాక, భారతీయ సినీ ప్రపంచంలోనూ అత్యంత చర్చనీయాంశమైన జంటగా మార్చేశాయి.