
ఇదే విధంగా, అల్లు అర్జున్‌కి మొదటినుంచే “స్టైలిష్ స్టార్” అనే ట్యాగ్ బాగా సూటయ్యింది. ఇండస్ట్రీలో “స్టైలిష్” అనే పదానికి అర్థం తీసుకువచ్చిన హీరో అంటే సందేహం లేకుండా అల్లు అర్జున్ అని అందరూ ఒప్పుకుంటారు. ఆయన ప్రతి మూవీలో కనిపించే లుక్స్, డాన్స్ స్టెప్స్, మేకోవర్, బాడీ లాంగ్వేజ్ — ఇవన్నీ కలిసి “స్టైల్” అనే పదాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ “ఐకాన్ స్టార్” అనే కొత్త ట్యాగ్‌తో ముందుకు సాగుతున్నందున, “స్టైలిష్ స్టార్” అనే బిరుదు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టుగా భావిస్తున్నారు చాలామంది సినీ అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది — “ఈ స్టైలిష్ స్టార్ అనే టైటిల్‌కి ఇప్పుడు సరైన వారసుడు ఎవరు?” అని మాట్లాడుకుంటున్నారు.
కొంతమంది నెటిజన్లు, సినీ ప్రేమికులు “రౌడీ హీరో విజయ్ దేవరకొండ” పేరు చెబుతున్నారు. ఆయన వ్యక్తిత్వం, ఫ్యాషన్ సెన్స్, మాట్లాడే తీరు, అటిట్యూడ్ — ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను తెచ్చాయి అని వారి అభిప్రాయం. మరి కొంతమంది మాత్రం, ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదిస్తూ, ఒక్కో అడుగుతో ముందుకు సాగుతున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకి ఈ ట్యాగ్‌కి ఎక్కువగా సూటవుతారని అంటున్నారు. సిద్ధు తన సినిమాల్లో చూపించే ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, డ్రెస్ సెన్స్, డైలాగ్ డెలివరీ స్టైల్ — ఇవన్నీ ఇప్పుడు యూత్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా సోషల్ మీడియా వేదికగా “కొత్త స్టైలిష్ స్టార్ ఎవరు?” అనే చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది. అభిమానులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటూ, “విజయ్ దేవరకొండ స్టైలిష్ స్టార్‌గా బాగా సరిపోతాడు”, లేదా “సిద్ధు జొన్నలగడ్డే రియల్ స్టైలిష్ స్టార్” అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్స్ చేస్తున్నారు.
మరి మీ అభిప్రాయం ఏమిటి?ఇండస్ట్రీలో తనదైన స్టైల్‌తో దూసుకుపోతున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండనా..?? లేదా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని పక్కాగా ఏర్పరుచుకుంటున్న యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డనా? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!!