సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఇంట్రస్టింగ్ ఫ్యామిలీ కనెక్షన్ న్యూస్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. కారణం – జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ పెళ్లి.  రీసెంట్‌గా నితిన్ .. లక్ష్మీ శివానితో ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి దగ్గర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహిత స్నేహితులు పాల్గొని ఈ వేడుకను మరింత హైలెట్ గా మార్చారు. గత ఏడాది నవంబర్‌లోనే నితిన్, శివాని లవ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ జంట చివరకు ఏడాది తర్వాత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. నితిన్ ప్రొఫెషనల్‌గా కొన్ని సినిమాలపై దృష్టి పెట్టడం, అలాగే రెండు కుటుంబాల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పెళ్లి కొంత ఆలస్యమైందని తెలిసింది.


ఈ వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తారక్ క్రీమ్ కలర్ కుర్తా ధరించి సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఇక ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. క్రీమ్ కలర్ శారీకి డైమండ్ జ్యువెలరీ జోడించి సంప్రదాయ లుక్ తో అందాల బొమ్మల కనిపించింది. పెళ్లి ఏర్పాట్లలో, పనుల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంది.ఇక ఈ వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ హాజరయ్యడం మరో హైలైట్‌గా నిలిచింది. వెంకటేష్ దంపతులు, సురేష్ బాబు దంపతులు, నాగచైతన్య, ఆయన తల్లి లక్ష్మీ, రానా దగ్గుబాటి, రానా భార్య మిహిక—హాజరై పెళ్లి వేడుకను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దారు.



అక్కడి నుంచే సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది — "నితిన్ భార్య శివానికి దగ్గుబాటి ఫ్యామిలీతో ఏదైనా బంధముందా?" అని మాట్లాడుకోవడం ప్రారంభించారు. నిజంగానే ఆ వార్తలో నిజం ఉందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, దివంగత ప్రొడ్యూసర్ రామానాయుడు గారికి వధువు శివాని మనవరాలు వరసలో అవుతుందట. అంటే వెంకటేష్, సురేష్ బాబు లకు కూతురు వరస అవుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే — నితిన్ భార్య శివాని, రానా దగ్గుబాటికి చెల్లి అవుతుంది.



ఇలా తీసుకుంటే ఇప్పుడు హీరో నితిన్ దగ్గుబాటి కుటుంబంలోకి వెళ్ళిన్నట్లే. ఇక రానా, నాగచైతన్య వంటి వారితో కూడా ఆయనకు బంధుత్వం ఏర్పడింది. ఈ ఫ్యామిలీ కనెక్షన్ బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో “ఇక తారక్ రానాని ఎలా పిలవాలి?” అనే హాస్య మీమ్స్, కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. కొందరు బ్రదర్ అని పిలవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ, నితిన్–శివాని జంటపై అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. సింపుల్‌గా అండ్ రాయల్‌గా జరిగిన ఈ వివాహ వేడుక, టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన అత్యంత రిచ్ & క్లాసీ సెలబ్రేషన్లలో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: