ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ రచ్చ రంబోలా చేస్తోంది — అదే సీక్వెల్స్. ఎక్కడ చూసినా “సీక్వెల్” అనే మాటే వినిపిస్తోంది. నిజానికి సినీ పరిశ్రమలో ప్రతి దశలో ఒక ప్రత్యేకమైన ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎమోషనల్ డ్రామాలు, ఆ తర్వాత డ్యూయల్ రోల్స్, కొంతకాలం ఫ్యాక్షన్ స్టోరీలు, తర్వాత మాస్ యాక్షన్ సినిమాలు, ఆ తర్వాత మాఫియా బ్యాక్‌డ్రాప్ చిత్రాలు... ఇలా ఒక్కో దశలో ఒక్కో తరహా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ప్రస్తుత తరుణంలో మాత్రం ఈ ట్రెండ్ అంతా సీక్వెల్స్ దిశగా మలుపు తిరిగింది. ఏ సినిమా హిట్ అయినా వెంటనే దానికి “పార్ట్ 2”, “చాప్టర్ 2”, అంటూ  సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో సాధారణం అయిపోయింది. చిన్న సినిమా కావొచ్చు, పాన్-ఇండియా సినిమా కావొచ్చు — హిట్ అయిన వెంటనే మేకర్స్ ఆలోచన సీక్వెల్ మీదే. కానీ ఈ ట్రెండ్‌కి కొత్త మలుపు ఇచ్చిన వ్యక్తి మాత్రం రిషబ్ శెట్టి.


‘కాంతారా’ సినిమా ద్వారా ప్రేక్షకులను అబ్బురపరిచిన రిషబ్ శెట్టి, దానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసిన మొదటి స్టార్ డైరెక్టర్‌గా నిలిచాడు. ఆయన రూపొందించిన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన హిట్ సాధించాడు. ప్రేక్షకులు కూడా ఈ కాన్సెప్ట్‌కి బ్రహ్మరథం పట్టారు. అదే కారణంగా ఇప్పుడు అనేకమంది స్టార్ హీరోలు కూడా రిషబ్ శెట్టి మార్గంలో నడుస్తున్నారు. “సీక్వెల్ కాదు, ఇప్పుడు ప్రీక్వెల్ టైమ్!” అని చాలామంది చెబుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌లో ముందంజలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు ప్రభాస్. తనదైన శైలి, పాన్ ఇండియా ఇమేజ్, విభిన్నమైన కథల ఎంపికతో ప్రభాస్ ఎప్పుడూ కొత్తదనం చూపించే హీరోగా నిలుస్తూనే ఉన్నాడు. ఆయన చేతిలో ప్రస్తుతం పలు భారీ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి దర్శకుడు హనురాఘవపూడి  దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజి’ సినిమా. ఈ సినిమా యాక్షన్ మరియు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.



తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఈ సినిమాలోని కాన్సెప్ట్‌కి చాలా ఇంప్రెస్ అయ్యి, దీని కోసం ఒక ప్రీక్వెల్ చేయాలని మేకర్స్ కి సజెస్ట్ చేశారట. కథలోని నేపథ్యం, పాత్రల ఆరంభం, కథ ఎక్కడ మొదలైందనే దానిపై ఆధారపడి ఒక ప్రత్యేకమైన ప్రీక్వెల్ స్టోరీని తెరకెక్కించాలని మేకర్స్‌కి సూచించినట్లు తెలుస్తోంది. దర్శకుడు హనురాఘవపూడి కూడా ఆ ఆలోచనతో పూర్తిగా ఏకీభవించారట. ఇలా ప్రభాస్ కూడా ఈ ప్రీక్వెల్ ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు అభిమానులు. సినీ వర్గాలు, సోషల్ మీడియాలో అభిమానులు “ఇంతకాలం ‘సీక్వెల్స్’ అంటూ సాగిన ట్రెండ్‌కి ఫుల్ స్టాప్ — ఇకపై ‘ప్రీక్వెల్స్’ రాజ్యం మొదలవుతుంది!” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.



మొత్తానికి, ప్రభాస్ ఇప్పుడు తన సినిమాల ద్వారా కేవలం విజువల్ వండర్ గానే కాదు, కాన్సెప్ట్ లెవల్ న్యూ ట్రెండ్స్‌నూ సెట్ చేస్తున్నాడు. రిషబ్ శెట్టి తర్వాత ఈ మార్గంలో అడుగుపెట్టిన ప్రభాస్‌కి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇండస్ట్రీలోని కొత్త వేవ్ — “సీక్వెల్స్ కాదు బాస్... ఇప్పుడు ప్రీక్వెల్స్ కాలం మొదలైంది!” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: