
ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు చిత్తూరులోని హై రోడ్డు 100 అడుగుల విస్తీర్ణంతో ఉండాల్సి ఉంది, కాని తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామని తెలిపారు. పరిహారం కావాలా, టిడిఆర్ బాండ్లు ఏవి కావాలో అభిప్రాయాలలు చెప్పాలని కోరడంతో.. ఆ సభలో కూర్చున్న జనసేన కార్యకర్త దయారాం వాటిని అంగీకరించలేదు. దయరాం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి.. అతను ఎమ్మెల్యేనే కాదు పోర**కు ఆరోజు పవన్ కళ్యాణ్ చిత్తూర్ కి వచ్చినప్పుడు హైరోడ్డు భవన యాజమాన్యులకు పరిహారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన వద్దకే మేము వెళ్తాం. నీవా నది నీరంత కూడా ప్రస్తుతం ఇళ్లలోకి వచ్చేస్తోంది, నీవా నది అక్రమాలన్నీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన నాయకులు.
చంద్రబాబు అమెరికా ,యూరప్ పోయి ఫండ్స్ తీసుకువచ్చి రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అంటున్నారు. ముందు చిత్తూరు హైరోడ్డుని అభివృద్ధి చేయాలంటూ తెలియజేశారు. చిత్తూరులోని హై రోడ్డు ఒక స్మశానం లాగా మారుతోందని అంటూ జనసేన కార్యకర్త దయరాం తీవ్రమైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే తాము అంగీకరిస్తామని టిడిఆర్ బాండ్లు తమకు వద్దని తెలియజేశారు. ప్రస్తుతం అటు చిత్తూరు రాజకీయాలలో జనసేన కార్యకర్త చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.