
అయితే పరిశీలనలో మాత్రం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అనుమానాస్పదమైన వస్తువులు కూడా లభించలేదంటూ తెలియజేశారు. ఈ బెదిరింపులు కూడా నకిలీవే అన్నట్లుగా తేలిపోయింది. గత కొంతకాలంగా ఇలాంటి నకిలీ మెయిల్స్ రూపంలో సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. కేవలం తమిళనాడునే కాకుండా అమెరికా, రష్యా ,ఇంగ్లాండ్ ,శ్రీలంక, సింగపూర్ తదితర కార్యక్రమాలకు కూడా ఇలాంటి గుర్తుతెలియని మెయిల్స్ తో చాలామందిని బెదిరిస్తున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు.
ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు తనిఖీలు చేయక అక్కడ ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు లేవని కేవలం కావాలని తప్పు దావ పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. తమిళనాడు పోలీసులు మాత్రం ఎలాంటి వచ్చిన ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ప్రజల భద్రతకు అన్ని విధాలుగా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఒకవేళ ఇలాంటివి నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఇలాంటి బెదిరింపు కాల్స్ వల్ల ఇప్పుడు ప్రజలలో మరింత భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫేక్ మెయిల్స్ రాకుండా ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తాయో చూడాలి మరి.